ఎగువన కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. లక్ష క్యూసెక్కులపైన వరద ప్రవాహం వస్తుండటంతో జలాశయంలో నీటిమట్టం 78 టీఎంసీలకు చేరుకుంది. దీనితో మొత్తం 11 క్రస్ట్ గేట్ల నుంచి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహానికి జలాశయం ఎడమవైపున ఉన్న పోర్లుకట్ట కోతకు గురైంది. అప్రమత్తమైన అధికారులు కోతకు గురైనవైపు ఉన్న 5 గేట్లు మూసేసి... మిగతా 6గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం ఈరోజు కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వరద ప్రవాహం ఇలాగే కొనసాగి ఉంటే.. పోర్లుకట్ట పూర్తిగా తెగి భారీ ప్రమాదం జరిగేదని స్దానికులు తెలిపారు.
ఇదీ చూడండి. సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారం.. కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు