నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామంలో పత్తి సుబ్బమ్మ అనే మహిళ ఇంట్లో కోళ్లను పెంచుతుంది. అయితే ఓ కోడి రోజు పెద్ద సైజు కోడి గుడ్డులను పెడుతున్నది. కాగా బుధవారం మాత్రం ఆ కోడి చిన్న సైజు కోడి గుడ్డును పెట్టింది. ఈ గుడ్డును చూసి చుట్టు పక్కలవారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఐతే కోడి గుడ్డు విషయమై వెటర్నరీ డాక్టర్ నరేష్‌ను సంప్రందించగా... కోళ్లలో కాల్షియం లోపం వల్ల చిన్న సైజు, పెంకు లేని గుడ్లు పెడతాయని అన్నారు. కోళ్లకు అధికంగా నీటిని అందించడం, కాల్షియం కలిగిన ఆహారం ఇవ్వడం ద్వారా ఈ లోపాన్ని నివారించవచ్చునని తెలిపారు.
ఇదీ చూడండి. సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి నీటి వృథా