ETV Bharat / state

రేసుగుర్రంలా కరోనా.. నత్తలా టీకా - నెల్లూరులో వ్యాక్సినేషన్

ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే..మరో వైపు వ్యాక్సినేషన్ నత్తలా సాగుతోంది. రెండో డోసు పొందాల్సిన వారు లక్షల్లో ఉండడమే ఇందుకు నిదర్శనం. తొలి డోసు 3.88 లక్షల మంది తీసుకోగా.. ఇంకా 2.44 లక్షల మంది రెండో డోసు కోసం వేచి చూస్తున్నారు.

nellore
టీకా వేస్తున్న నర్సు
author img

By

Published : May 24, 2021, 3:44 PM IST

కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. రేసుగుర్రంలా వాయువేగంతో విస్తరిస్తోంది. ప్రతి గడపనీ పలకరిస్తోంది. కుటుంబాలకు కుటుంబాలనే కబళిస్తోంది. నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతటి ప్రమాదకరంగా మారిన దీని నియంత్రణకు టీకానే మార్గమని ప్రభుత్వం భావించింది. దశలవారీగా వేస్తున్నారు. కానీ ఈ కార్యక్రమం మొదట్లో ముమ్మరంగా సాగింది. నేడు నత్తను తలపిస్తోంది. దీంతో మహమ్మారికి కట్టడి పడే సూచనలు కనిపించడం లేదు. దివ్యౌషధానికి లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రెండో డోసు పొందాల్సిన వారు లక్షల్లో ఉండడమే ఇందుకు నిదర్శనం.

నాడు వేలల్లో వేసిన టీకాలు. నేడు వందలకు చేరుకున్నాయి. నిల్వలు ఉన్నంతవరకైనా త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉన్నా స్తబ్ధత వీడడం లేదు. తొలి, రెండు డోసులకు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నా నామమాత్రంగానే ప్రక్రియ కొనసాగుతండడం ఈ ప్రక్రియ తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. జిల్లాలో జనవరి 16న టీకా వేసే కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, ఆ తర్వాత వైద్య, ఆరోగ్య సిబ్బందికి, ప్రభుత్వ ఉద్యోగులకు దశలవారీగా వేశారు. జిల్లాలో ఇప్పటివరకు 532624 మందికి వేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో తొలి డోసు వేయించుకున్నవారు 3.88 లక్షల మంది, రెండో డోసు వారు 1.44 లక్షల మంది ఉన్నారు. ఇంకా 2.44 లక్షల మంది రెండో డోసు కోసం వేచి ఉన్నారు. వీరిలో కొవిషీల్డ్‌ 4.72 లక్షల మంది వరకు పొందగా, కొవాగ్జిన్‌ను 60 వేలకు పైగా వేసుకున్నారు. లక్షల్లో ప్రజలు వేచి చూస్తున్నారు.

నిబంధనలు బేఖాతర్‌

నెల్లూరు జిల్లాలో ఏర్పాటుచేసిన టీకా కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. ఇబ్బడిముబ్బడిగా ప్రజలు వస్తుండడంతో కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. వీటికి వచ్చే వారు క్యూ లైన్లు పాటించడం లేదు. సామాజిక దూరం లోపించడంతో వైరస్‌ వ్యాప్తికి కారణంగా నిలుస్తోంది. కనీసం చేతులకు శానిటైజర్‌ రాసే పరిస్థితులు ఎక్కడా లేవు. ప్రజలు వ్యక్తిగత శానిటైజర్లను వెంట తీసుకొచ్చుకుంటున్నారు. శానిటైజర్లను తీసుకురాని వారికి ఆసుపత్రి వారు చేతులను శుభ్రం చేయని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

నేడు మలిదఫా

నగరంలోని కోటమిట్ట, కిసాన్‌నగర్‌, ఎన్టీఆర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో సోమవారం కొవాగ్జిన్‌ రెండో డోసు వేస్తున్నట్లు డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి ఆదివారం ప్రకటించారు. ప్రైవేటుగా వేసుకున్న లబ్ధిదారులకు సైతం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తూ, 45 ఏళ్లు దాటిన వారికి కొవిషీల్డ్‌ మొదటి డోసు కలెక్టర్‌ అనుమతి మేరకు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. 84 రోజులు పూర్తి చేసుకున్న కొవిషీల్డ్‌ లబ్ధిదారులు నగరంలోని యూహెచ్‌సీలు, పీహెచ్‌సీలకు వెళ్లి రెండో డోసు వేయించుకోవచ్చని తెలిపారు.

మందగమనం

జిల్లాలో కొవిడ్‌ టీకా ప్రక్రియ నత్తనడకను తలపిస్తోంది. గరిష్ఠంగా రోజుకు 20 వేల మంది వరకు వేసిన రోజుల నుంచి నేడు కనిష్ఠంగా 500 లోపు వేస్తున్నారు. దీని ప్రకారం దీన్నిబట్టి ఈ కార్యక్రమం జిల్లాలో ఎంత మందగమనంగా సాగుతుందో తెలుసుకోవచ్ఛు

ఈ నెలాఖరుకు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు పూర్తి చేసి, వచ్చే నెల నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వేయాలనిప్రభుత్వాలు సంకల్పిస్తున్నాయి. అయినా రెండో డోసు వేయాల్సిన లబ్ధిదారులకే పూర్తి చేసే పరిస్థితులు కనిపించడం లేదు.

మరోవైపు ప్రభుత్వం కొవిషీల్డ్‌ రెండో డోసు కాలపరిమితిని 12 నుంచి 16 వారాలు పెంచింది. కొవాగ్జిన్‌కు మాత్రం 28 రోజుల వ్యవధినే ఉంచింది. కొవిషీల్డ్‌ వేసుకొనే లబ్ధిదారులు సైతం లక్షల్లో ఉండడం, కాల పరిమితిని పెంచడం కారణాలుగా నిలుస్తున్నాయి.

అందరికీ వేస్తాం

జిల్లాలో తొలి డోసు పూర్తి చేసుకున్న వారందరికీరెండో సారి పూర్తి స్థాయిలో వేస్తాం. ప్రజలు ఆందోళనకు గురికావద్ధు కొవిషీల్డ్‌ టీకా రెండో డోసు కాల పరిమితి గడువు పెంచడంతోనే రోజుకు వేసే వారి సంఖ్య తగ్గుతోంది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సోమవారం నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న 45 ఏళ్లు దాటిన వారికి వేసేందుకు సంకల్పించాం. పీహెచ్‌సీలు, యూహెచ్‌సీలకు వెళ్లి వేయించుకోవచ్ఛు ఎక్కువ సిబ్బంది ఉంటే అక్కడికే వచ్చి టీకా వేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాం. - రాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో

ఇదీ చూడండి. ఆనందయ్య కరోనా మందు పనితీరుపై.. పరిశోధన ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.