నెల్లూరు జిల్లాకు వచ్చిన హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్‌కు.. కలెక్టర్ కార్యాలయంలో నిరసన సెగ తగిలింది. సచివాలయ ఉద్యోగులు, వార్డు వాలంటీర్లు ప్లకార్డులతో ఆయనకు నిరసన స్వాగతం పలికారు. కలెక్టరేట్ గేటు నుంచి బారులు తీరి నిలబడ్డారు. వారి డిమాండ్లు వివరిస్తూ సచివాలయ ఉద్యోగులు.. అజయ్ జైన్‌కు వినతిపత్రం ఇచ్చారు.
వారిపై అసహనం వ్యక్తం చేసిన అజయ్‌జైన్.. "రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వం పై పోరాటం చేస్తున్న విధానం సరైనది కాదు. మీ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది" అని అన్నారు.
ఇదీ చదవండి: night curfew in ap: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ వాయిదా.. ఎందుకంటే