నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కచేరి దేవరాపల్లిలో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. జిల్లా అధికారులు కొవిడ్ పోరులో నిమగ్నమై ఉండగా.. అక్రమార్కులు మాత్రం తమ పని కానిచ్చేస్తున్నారు. పెన్నా నది పరివాహక ప్రాంతంలో జేసీబీల సహాయంతో ఇసుకను తవ్వి .. రాత్రి వేళల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఫిర్యాదు చేసినప్పటికీ.. అధికారులు పట్టించుకోలేదని వారు చెబుతున్నారు.
ఇదీ చదవండి: నిర్లక్ష్యం వద్దు... సేవాభావంతో పనిచేయండి: మంత్రులు