ETV Bharat / state

ఇసుక పాలసీని అడ్డుపెట్టుకొని... అక్రమ వ్యాపారం

అధికారిక ఇసుక రీచ్​ల నుంచి అర్థరాత్రి వేళ లారీల్లో యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పేరుకే అధికారిక ఇసుక రీచ్​లు అయినప్పటికీ నెల్లూరు జిల్లాలో కొందరు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో అక్రమంగా ఇసుక నిల్వలు తయారుచేసి అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు.

sand illegal transport
ఇసుక అక్రమ రవాణా
author img

By

Published : Jun 15, 2020, 2:45 PM IST

ప్రభుత్వం సామాన్యుల కోసం తెచ్చిన ఇసుక పాలసీ అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. సామాన్యులకు ఇసుక భారమవుతోంది. నెల్లూరు జిల్లా వాకాడు వద్ద ఉన్న అధికారిక ఇసుక రీచ్​లో ప్రభుత్వ అనుమతుల పేరుతో అడ్డగోలుగా ఇసుక తవ్వేస్తున్నారు. పరిమితికి మించి లారీల్లో ఇసుకను నింపుతున్నారు. కొన్ని అనుమతి లేని లారీల్లోనూ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. సమీపంలోని గ్రామాల్లో ఇసుకను డంప్ చేస్తూ.. రాత్రి సమయాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ బయటకు తరలిస్తున్నారు. ఇసుక రీచ్​లను దక్కించుకున్న గుత్తేదారులు, స్థానిక నాయకులతో కుమ్మక్కై చిత్తూరు జిల్లా, చెన్నై రాష్ట్రానికి ఇసుకను తరలిస్తున్నారు. వెంకటాచలం, కొండుగుంట ప్రాంతాల్లో ఉన్న నిల్వలు వద్ద ధరలు ఎక్కువగా చెబుతున్నారు. బిల్లులు లేకుండా జాతీయ రహదారిపై తరలిపోతున్న ఇసుక లారీలను పోలీసులు పట్టుకుంటున్నప్పటికీ ఇసుక అక్రమ వ్యాపారం మాత్రం అదుపులోకి రావడం లేదు. ఇతర జిల్లాలకు ఇసుకను తరలించడం జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు కొరతగా మారింది.

ఇవీ చూడండి.. లాక్​డౌన్​ సడలింపులతో విజృంభిస్తోన్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.