నెల్లూరు ఆర్టీసీ కార్మికులు ఆర్ఎం కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కరోనా నేపథ్యంలో యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోవటం లేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఇద్దరు కార్మికులు ఆకస్మాత్తుగా మృతి చెందటంతో తమకు విధులు నిర్వహించాలంటేనే భయంగా ఉందని వాపోయారు. శానిటైజర్లు, మాస్కులు సైతం యాజమాన్యం సరఫరా చేయటం లేదని తెలిపారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో మరో 1322 మందికి కరోనా.. 20 వేలు దాటిన బాధితులు