ETV Bharat / state

రైతు భరోసా కేంద్రాల్లో... 50 శాతం సబ్సిడీతో విత్తనాలు - ఆర్బీకేల వార్తలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు నెల్లూరు జిల్లా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు, భూసార పరీక్షలు నిర్వహణ ఆర్​బీకేల్లో అందుబాటులో ఉంటాయన్నారు. పంటలకు సంబంధించిన సలహాలను రైతులకు అందిస్తామన్నారు.

రైతు భరోసా కేంద్రాల్లో... 50 శాతం సబ్సిడీతో విత్తనాలు

author img

By

Published : Jun 17, 2020, 3:40 PM IST

నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, వింజమూరు, కావలి, ఆత్మకూరు, కలిగిరి రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఆనందకుమారి తెలిపారు. జీలుగ విత్తనాలు 9500 క్వింటాళ్లు, మినుములు1700 క్వింటాళ్లు, పిల్లిపెసర 7500 మొత్తం 18,700 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఈ విత్తనాలు 50 శాతం సబ్సిడీతో రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. పచ్చిరొట్ట విత్తనాలు కావాల్సిన రైతులు రైతు భరోసా కేంద్రంలో అగ్రికల్చరల్ సహాయ సంచాలకులను సంప్రదించాలన్నారు. వరి విత్తనాలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆమె తెలిపారు.

ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో ఇక నుంచి భూసార పరీక్షలు కూడా జరుగుతాయని జేడీఏ ఆనంద కుమారి తెలిపారు. భూసార పరీక్ష చేసి అప్పటికప్పడు ఫలితాలు రైతులకు తెలియజేస్తామన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో సహాయకుల ద్వారా రైతులకు సూచనలు, సలహాలు ఇస్తామన్నారు. రైతులు తప్పనిసరిగా ప్రతీ వస్తువును రైతు భరోసా కేంద్రంలో కొనుగోలు చేయాలన్నారు.

రైతులు తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల్లో తమ పొలం పాస్ బుక్ వివరాలు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. వివరాలు నమోదు చేసుకుంటే వ్యవసాయానికి సంబంధించిన అన్ని వస్తువులు రైతు భరోసా కేంద్రంలో తీసుకోవచ్చన్నారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో మరో 351 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.