ETV Bharat / state

రెడ్ జోన్​గా ప్రకటించారు.. నిర్లక్ష్యంగా వదిలేశారు! - గూడూరు రెడ్ జోన్

కరోనా కేసు నమోదుతో రెడ్ జోన్​గా ప్రకటించిన అధికారులు.. ఆ తర్వాత తమ ప్రాంతాన్ని పట్టించుకోవట్లేదని... నెల్లూరు జిల్లా గూడూరు ప్రజలు ఆరోపించారు. తమకు సరకులు, కూరగాయలు ఏవీ అందుబాటులో లేవని వాపోయారు.

red zone area people problems in gudur prakasam district
గూడూరు రెడ్ జోన్ ప్రాంతం
author img

By

Published : May 24, 2020, 5:05 PM IST

కరోనా కేసు నమోదుతో రెడ్ జోన్​గా ప్రకటించిన అధికారులు.. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారని నెల్లూరు జిల్లా గూడూరు ప్రజలు ఆరోపించారు. కోయంబేడు ప్రభావంతో గూడూరులో వరుసగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ కారణంగా.. పట్టణంలోని కోతరము వీధిని రెడ్ జోన్​గా ప్రకటించారు.

నాటి నుంచి తమకు సరకులు, కూరగాయలు ఏవీ అందుబాటులో లేవని అక్కడి ప్రజలు వాపోయారు. అధికారులు, నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని.. తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పసిపిల్లలకు పాలు, మందులు దొరక్క అవస్థలు పడుతున్నామని చెప్పారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఇవీ చదవండి:

కరోనా బాధితుల కోసం మైత్రి రోబో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.