మా శ్వాస ఉన్నంత వరకు ఇక్కడే వైద్యం చేస్తాం. ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తాం.. నెల్లూరు రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల వైద్యులు మాటలు ఇవి. 67 ఏళ్లుగా.. ప్రజా వైద్యమే లక్ష్యంగా ఈ వైద్యశాల పనిచేస్తుంది. ఇక్కడి ఆసుపత్రిలో పనిచేస్తున్న 50మంది వైద్యులు సుధీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నారు. కష్టాకాలంలోనూ భయపడకుండా కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఈ వైద్యశాల సేవలు అందిస్తుంది.
గుడిసెలో 5 పడకలతో ప్రస్థానం ప్రారంభం
నెల్లూరు నగరం నడ్డిబొడ్డులో ఉంటుంది డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల. 1953లో డాక్టర్ రామచంద్రారెడ్డి ఐదు పడకలతో ఆసుపత్రిని ఓ గుడిసెలో ఏర్పాటు చేశారు. మద్రాస్ లో వైద్య వృత్తిని అభ్యసించిన ఆయన.. సామాన్యులకు ఆధునాతన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించారు. ఆయన లేనప్పటికీ, నేటికి ఆయన ఆశయాన్ని కొనసాగుతోంది.
ఓపీ 70 రూపాయలే..
కిందటి ఏడాది వరకూ ఇక్కడ ఓపీ 50 రూపాయలు. ఈ ఏడాది నుంచి 70 రూపాయలు చేశారు. కార్పొరేట్ లో పనిచేసే వైద్యులు కొందరు ఇక్కడికి వచ్చి సేవా భావంతో పనిచేస్తారు. 40 ఏళ్లుగా..పనిచేస్తున్న వారు 30మంది ఉన్నారు. ఆదాయం కన్నా సేవాభావం గొప్పదని వారు చెబుతారు.
అవసరమైతే ఉచితంగా మందులు
ఆసుపత్రిలోకి వెళ్లే ముందు.. ఆహ్లాదకరమైన పచ్చదనం పలకరిస్తుంది. ఇక్కడ చేసే ప్రతీ పరీక్ష బయటతో పోల్చుకుంటే.. మూడు వంతులు తక్కువ రేటు. కనీసం మందులు కొనలేని పరిస్థితుల్లో ఉన్న పేదవారికి ఉచితంగా కూడా మందులు ఇస్తారు. ఇక్కడికి రోజు 1000 మంది వరకు వైద్యం కోసం వస్తారు. రోగులు నుంచి వసూలు చేస ప్రతి పైసాలో నామమాత్రంగా వైద్యులు, నర్సులు జీతాలు తీసుకుంటారు. మిగిలినది ఆసుపత్రి అభివృద్ధికి ఖర్చు చేస్తారు.
సేవే మార్గం.. మెరుగైనే వైద్యమే లక్ష్యం
రామచంద్రారెడ్డి ఆసుపత్రి సేవా సంస్థగా నిర్వహిస్తున్నారు. వైద్యులు కూడా ఇక్కడ పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు. నలబై ఏళ్ల కిందట వైద్యం అందుబాటులో లేని సమయం నుంచి నేటి వరకు గ్రామీణంలో ప్రాథమిక వైద్యం అందించేందుకు వైద్యులను తయారు చేస్తున్న ఘనత ఈ ఆసుపత్రికి దక్కుతుంది. ఎంబీబీఎస్ చేసిన వైద్యులు ఇక్కడ శిక్షణ పొందడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లలో 5000 మంది వైద్యులు ఇక్కడ శిక్షణ పొంది రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ప్రజా వైద్యశాలలను నడుపుతున్నారు.
ఇదీ చదవండి: