నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామంలో కరోనా రెండు కాలనీల మధ్య చిచ్చు రేపింది. ఈనెల 14 న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని.. కొందరు యువకులు పక్కనే ఉన్న చెర్లోపాలెంలో ఆహారం పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. గుంపులుగా వచ్చి ఆహారం ఎందుకు పంపిణీ చేస్తున్నారని చెర్లోపాలెం గ్రామస్థులు ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన చెర్లోపాలేనికి చెందిన 30 కుటుంబాలు గ్రామాన్ని వదిలి.. కాశీపురం పాఠశాలలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఇరు వర్గాలకు సర్దిచెప్పేందుకు యత్నిస్తున్నారు.
ఇదీ చదవండి..