ETV Bharat / state

పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరో విజయాన్ని అందుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కార్టోశాట్‌-3 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాన్ని మోసుకుంటూ ఉదయం 9గంటల 28 నిమిషాలకు సతీష్ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకుపోయిన పీఎస్​ఎల్వీ-సీ47 వాహకనౌక మరో 13 నానో ఉపగ్రహాలను కూడా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ 13 నానో ఉపగ్రహాలు..అమెరికాకు చెందినవి.

pslv-c-47-isro-success
pslv-c-47-isro-success
author img

By

Published : Nov 27, 2019, 10:29 AM IST

Updated : Nov 27, 2019, 2:24 PM IST

పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగం విజయవంతం

దేశ రక్షణ రంగం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహం కార్టోశాట్‌-3 ప్రయోగం విజయవంతమైంది. దేశంలోకి చొరబడే ఉగ్రవాదులను పసిగట్టడంతోపాటు వారి కదలికలు, స్థావరాలపై నిఘా నేత్రంలా పనిచేసే ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా రోదసీలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని రెండో ల్యాంచ్‌ ప్యాడ్‌ నుంచి ఉదయం 9గంటల 28 నిమిషాలకు పీఎస్​ఎల్వీ-సీ47 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.

పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగం విజయవంతం

పీఎస్​ఎల్వీ-సీ47...కార్టోశాట్‌-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 నానో ఉపగ్రహాలను నిర్ణిత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. ఈ మొత్తం ప్రక్రియ 27 నిమిషాల్లోనే పూర్తయింది. ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించిన 26 గంటల కౌంట్‌డౌన్‌... మంగళవారం ఉదయం 7 గటంల 28 నిమిషాలకు ప్రారంభమై....ఇవాళ ఉదయం 9గంటల 28 నిమిషాలకు ముగిసింది. కార్టోశాట్-3 బరువు..... సుమారు 16వందల 25 కేజీలు. మూడో తరానికి చెందిన ఈ భూ పరిశీలన ఉపగ్రహన్ని.... హై రెజల్యూషన్‌ ఎర్త్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. అంతరిక్షంలో...ఐదేళ్ల పాటు కార్టోశాట్-3 సేవలందించనుంది. పట్టణ అభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులు, మౌలిక వసతుల అభివృద్ధి, తీరప్రాంత వినియోగంలో ఈ ఉపగ్రహం సేవలందించనుంది. దీనితో పాటు..... ఉగ్రవాద శిబిరాలకు సంబంధించిన ఫొటోలను మరింత జూమ్‌ చేసి తీసే వీలు కలుగుతుంది.

ఇవి కూడా చదవండి:

రైతు భరోసా ఆలస్యంపై సీఎం ఆగ్రహం

Intro:Body:

జయహో ఇస్రో

పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో............ మరో విజయాన్ని అందుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కార్టోశాట్‌-3 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాన్ని మోసుకుంటూ ఉదయం 9గంటల 28 నిమిషాలకు సతీష్ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకుపోయిన పీఎస్​ఎల్వీ-సీ47 వాహకనౌక మరో 13 నానో ఉపగ్రహాలను కూడా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. 13 నానో ఉపగ్రహాలు..అమెరికాకు చెందినవి.

దేశ రక్షణ రంగం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహం కార్టోశాట్‌-3 ప్రయోగం విజయవంతమైంది. దేశంలోకి చొరబడే ఉగ్రవాదులను పసిగట్టడంతోపాటు వారి కదలికలు, స్థావరాలపై నిఘా నేత్రంలా పనిచేసే ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా రోదసీలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని రెండో ల్యాంచ్‌ ప్యాడ్‌ నుంచి ఉదయం 9గంటల 28 నిమిషాలకు పీఎస్​ఎల్వీ-సీ47 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.

పీఎస్​ఎల్వీ-సీ47...కార్టోశాట్‌-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 నానో ఉపగ్రహాలను నిర్ణిత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. ఈ మొత్తం ప్రక్రియ 27 నిమిషాల్లోనే పూర్తయింది. ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించిన 26 గంటల కౌంట్‌డౌన్‌... మంగళవారం ఉదయం 7 గటంల 28 నిమిషాలకు ప్రారంభమై....ఇవాళ ఉదయం 9గంటల 28 నిమిషాలకు ముగిసింది. కార్టోశాట్-3 బరువు..... సుమారు 16వందల 25 కేజీలు. మూడో తరానికి చెందిన ఈ భూ పరిశీలన ఉపగ్రహన్ని.... హై రెజల్యూషన్‌ ఎర్త్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. అంతరిక్షంలో...ఐదేళ్ల పాటు కార్టోశాట్-3 సేవలందించనుంది. పట్టణ అభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులు, మౌలిక వసతుల అభివృద్ధి, తీరప్రాంత వినియోగంలో ఈ ఉపగ్రహం సేవలందించనుంది. దీనితో పాటు..... ఉగ్రవాద శిబిరాలకు సంబంధించిన ఫొటోలను మరింత జూమ్‌ చేసి తీసే వీలు కలుగుతుంది.

Conclusion:
Last Updated : Nov 27, 2019, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.