ETV Bharat / state

కొవిడ్​ తెచ్చిన తంట... భార్య, కుమారుడిని నిర్బంధించిన ప్రొఫెసర్​

author img

By

Published : Jun 22, 2021, 9:01 PM IST

ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పిన ఆ ప్రొఫెసర్​ బుద్ధి..పక్కదారి పట్టింది. సమాజంలో గౌరవ హోదాలో ఉండి.. అదే సమాజం చేత వేలెత్తి చూపించుకునేలా వ్యవహరించాడు. కట్టుకున్న భార్య, కన్న కుమారుడిపై దయ లేకుండా గృహనిర్బంధం చేశాడు. ఈ ఘటన నెల్లూరులోని బాలాజీనగర్​లో జరిగింది.

house arrest
భార్య, కుమారుడిని నిర్బంధించిన ప్రొఫెసర్​

నెల్లూరు జిల్లా బాలాజీనగర్​లో ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ అతని భార్య, కుమారుడిని ఇంట్లో నిర్బంధించాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వారికి బయటకు తీసుకువచ్చారు.

అసలేం జరిగింది..

చెంచురెడ్డి అనే ప్రొఫెసర్​ పట్టణంలోని బాలాజీ నగర్​లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇంట్లో పనులు చేసేందుకు ప్రొఫెసర్..​ ఓ మహిళను పని మనిషిగా తీసుకువచ్చాడు. ఆ పని మనిషితో చెంచురెడ్డి చనువుగా ఉండటం గమనించిన కుటుంబసభ్యులు.. ఆమెను బయటకు పంపించారు. ఇటీవల ప్రొఫెసర్​ కుటుంబ సభ్యులకు కొవిడ్​ సోకటంతో ఆ పనిమనిషి వీరికి సేవలు అందించింది. దీంతో ఆమెను మళ్లీ పనిలో పెట్టుకునే విషయంపై ప్రొఫెసర్​ దంపతుల మధ్య కలతలు రేగాయి. ఆ కోపంతో భార్య, కుమారుడిని ఇంట్లో నిర్బంధించి అతను బయటికి వెళ్లిపోయాడు.

వివాహేతర సంబంధం కారణంగానే తమను నిర్బంధించారంటూ ప్రొఫెసర్​ భార్య అతనిపై దిశా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు.

ఇదీ చదవండి: Missing: ఈదరలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.