ETV Bharat / state

ఉడికి ఉడకని భోజనం..తాగేందుకు దొరకని నీరు !

author img

By

Published : Apr 16, 2021, 6:20 PM IST

నెల్లూరు జిల్లా గూడూరు జిల్లా పరిషత్ పాఠశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులకు భోజన వసతి కల్పించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జిల్లా అధికారుల సమక్షంలో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

polling staff  Troubles in nellore
ఉడికి ఉడకని భోజనం..తాగేందుకు దొరకని నీరు

నెల్లూరు జిల్లా గూడూరు జిల్లా పరిషత్ పాఠశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులకు భోజన వసతి కల్పించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం అందరికీ సరిపోలేదని..తాగేందుకు నీరు కూడా అందుబాటులో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ నీటిని తాగుదామన్నా..క్యాన్​లు పూర్తిగా ఖాళీ కావడంతో పోలింగ్ విధులకు వచ్చిన సిబ్బందికి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జిల్లా అధికారుల సమక్షంలో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. చేసేది ఏమీ లేక జిల్లా కలెక్టర్ చూస్తుండిపోయారు. ఒక మహిళ కన్నీరు పెట్టింది. అనారోగ్యంగా ఉన్నామని...3 గంటలైనా భోజనాలు, నీరు లేకపోతే ఎలాగని వాపోయారు.

ఇదీచదవండి

వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ డైరెక్టర్‌కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.