నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పలు దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో కొవిడ్-19 నిబంధనలు పాటించకుండా మాస్కులు, చేతికి గ్లౌజులు, శానిటైజర్స్ ఉయోగించకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణాలను ఎస్సై పాపారావు మూయించారు. కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.
ఇదీ చూడండి
శ్మశానాలనూ వదలకుండా దోచుకుంటున్నారు: తెదేపా అధినేత చంద్రబాబు