నెల్లూరు జిల్లా కావలి పట్టణం సమీపంలోని మధురుపాడు గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన మల్లికార్జున అనే వ్యక్తి ఇంట్లో గుట్కా ప్యాకెట్లు ఉన్నాయనే సమాచారంతో దాడులు చేసిన పోలీసులు నిషేధిత గుట్కాతో పాటు 41.30 లక్షలు రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి...