ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా అవుతూనే ఉన్నాయి. తాజాగా.. ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 32 కిలోల గంజాయిని నెల్లూరు సెబ్ అధికారులు పట్టుకున్నారు. వాహన తనిఖీలు చేస్తుండగా.. ఇద్దరి వద్ద ఈ గంజాయి పట్టుబడింది.
కేరళకు చెందిన మహ్మద్ సహాజ్.. రాజమండ్రిలో కిలో గంజాయిని కొనుగోలు చేసి, బట్టల బ్యాగులో దాచి, ఆర్టీసీ బస్సులో తిరుపతికి తీసుకువెళ్తున్నాడు. నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా.. సెబ్ అధికారులకు పట్టుబడ్డాడు. విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన దేవి అనే మహిళ 20కిలోల గంజాయిని.. మరో ఆర్టీసీ బస్సులో తిరుపతికి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.లక్ష మేర ఉంటుందని, బహిరంగ మార్కెట్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంద పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: