కొవిడ్ విలయతాండవం చేస్తున్న తరుణంలో.. నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలేరమ్మ ఆలయం వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. కరోనా నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ నేడు జాతర జరగాల్సి ఉండటంతో భక్తులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు. ఆలయానికి తలుపులు వేసి ఉన్నప్పటికీ బయటే పూజలు జరిపి మెుక్కులు చెల్లించుకున్నారు. పోలీసులు కట్టడి చేసినా వినిపించుకోలేదు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈరోజు నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమలు కానుండటంతో ప్రజలు నిత్యావసరాలకోసం దుకాణాల వద్ద బారులుతీరారు.
ఇవీ చదవండి: