నెల్లూరు జిల్లా కావలి పట్టణ మద్దూరుపాడు సమీపంలో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన నివాసాలను లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతూ... భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గ నాయకులు పసుపులేటి సుధాకర్ ... లబ్ధిదారులతో కలిసి తమకు కేటాయించిన నివాసాలను ఇవ్వాలని కోరుతూ డిమాండ్ చేశారు. నగదు కట్టించుకొని స్థిర నివాసాలు నిర్మించి ఇప్పటికీ తమకు ఇవ్వలేదని... బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు నివాసాలు ఇచ్చే వరకు ఆందోళనలు చేపడతామని భాజపా నాయకులు చెబుతున్నారు.
ఇవీ చదవండి