నెల్లూరు నగరంలో లాక్డౌన్ పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిత్యావసరాల కొనుగోలు పేరుతో బయటకు వస్తున్నారు. స్థానిక స్టోన్‌హౌస్ పేట మార్కెట్ కూడలిలో గుంపులుగా సరుకులు కొనుగోలు చేశారు. మార్కెట్ కూడలిలో వందకు పైగా దుకాణాలు ఉన్నాయి. ప్రతి దుకాణం వద్ద దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. ద్విచక్రవాహనంపై సైతం ఇద్దరు, ముగ్గురు కలిసి తిరుగుతున్నారు. అయితే పోలీసులు మాత్రం.. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: