తూర్పుకనుమల మధ్య పర్వత ప్రాంతాల్లో నెల్లూరు, కడప జిల్లాల మధ్య విస్తరించిన పెంచలకోన పచ్చని అందాలతో కలకలలాడుతోంది. ఇక్కడి కొండలు, పచ్చని చెట్ల మధ్య పెనుశిల నరసింహస్వామి దేవాలయం కొలువై ఉంది. స్వామి వారిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. నెల్లూరు జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 3వేల అడుగుల ఎత్తున ఉంది ఈ క్షేత్రం.
మనసు దోచే జలపాతాలు
పెంచలకోన క్షేత్రంలో సప్తతీర్థాలు కొలువుదీరి ఉన్నాయి. కొండ మీద నుంచి దిగువన ఉన్న కోనకు చేరుకునే వరకు ఏడు నీటి గుండాలు ప్రవహిస్తుంటాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఇవి మరింత అందంగా మారాయి. వీటికి తోడు అటవీ శాఖ అధికారులు ఆలయ ప్రవేశం వద్ద చక్కటి ఉద్యానవనం ఏర్పాటు చేశారు. పర్యటకులను ఆకర్షించేలా ఈ పార్కును తీర్చిదిద్దారు. దట్టమైన కీకారణ్యంలో ఉన్నప్పటికి ఇక్కడికి వచ్చే భక్తులు, పర్యటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి