జనసేన ప్రభుత్వం వస్తే అన్ని రంగాల వారి అభివృద్ధికి కృషి చేస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం చెంచులక్ష్మీపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి అయితే రైతన్నలకు నెలకు ఐదువేల రూపాయల పింఛన్ అందజేస్తామన్నారు. సంపాదనతో సంబంధం లేకుండా మహిళలకు 6 నుంచి 10 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని జనసేనాని స్పష్టంచేశారు.
ఇవీ చదవండి.