ETV Bharat / state

Pathetic Situation Of Old Couple: పట్టించుకోని పిల్లలు.. అనాథలైన వృద్ధ దంపతులు - తల్లిదండ్రులకు కూడు పెట్టని కూతుర్లు

Pathetic Situation Of Old Couple: ఆ వృద్ధ దంపతుల జీవితం ప్రతిరోజు బాధగా, భారంగా సాగుతోంది. శరీరంలో సత్తువ ఉన్నన్ని రోజులు కన్నబిడ్డలకు కష్టాన్ని వారి దరి చేరనివ్వలేదు. వారు ఆకలితో కడుపు మాడ్చుకొని, వారి పిల్లలకు ఆకలి ఎలా ఉంటుందో తెలియకుండా పెంచారు. అదే ఆకలి వారికి జీవితాంతం ఉంటుదని ఆ రోజు వాళ్లు ఊహించి ఉండరు. ఇప్పుడు వారి బిడ్డలకు రెక్కలు వచ్చేసరికి ఆస్తులు తీసుకొని ఎగిపోయారు. వారు ఎవరో మాకు తెలియదు అంటూ ఖరాకండిగా మాట్లాడుతున్నారు ఆ వృద్ధ దంపతుల కడుపున పుట్టిన ఆ ముగ్గురు. వారి కన్నీటి వ్యధను చూడలేక స్థానికులు ఆదుకుంటున్నారు. ఈ కన్నీటీ వ్యధ నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 15, 2023, 3:08 PM IST

వృద్ధ దంపతుల మనో వేదన..అనాథలైన దంపతులు

Pathetic Situation Of Old Couple in Atmakuru : "మాకు ముగ్గురు పిల్లలు.. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. మా ఆస్తులు తీసుకోని తరిమేశారు. మా ప్రాణం పోక, ఆగక అల్లాడుతున్నాము" ఇది ఓ వృద్ధ దంపతులు కన్నీటి విషాద గాధ. పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడంటారు. కానీ ఈ పుత్రుడు వారి తల్లిదండ్రులకు మానసికంగా నరకాన్ని చూపిస్తూ.. వాళ్లు ఎవ్వరో నాకు తెలీదండూ ఖరాకండిగా మాట్లాడుతున్నాడు. కూతుర్లు సైతం ససేమిరా అంటూ వారిని అనాథలను చేశారు. ఆ వృద్ధ దంపుతులు బతుకు బండిని ఈదలేక అలసి పోతున్నారు. కానీ వారి దీనస్థితిని అర్థం చేసుకున్న స్థానికులు మానవత్వంతో వారికి తోచిన సహాయం చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం ఏసీఎస్ఆర్ కాలనీలో నివసిస్తున్న జాఫర్ హుస్సేన్, బీబీ జాన్ అనే వృద్ధ దంపతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ముగ్గురు సంతానం ఉన్న వీరికి అన్నం పెట్టే కుటుంబ సభ్యులు లేక అనాథలుగా మిగిలారు. ముగ్గురు పిల్లలు వీళ్లని పట్టించుకోకుండా వదిలేసి వెళ్లారు. వృద్ధురాలు కిడ్నీల సమస్యతో మంచం పట్టగా, భర్త జాఫర్ హుస్సేన్ పక్షవాతంతో కాలు చేయి పని చేయడం లేదు. ఇలా ఇద్దరు అనారోగ్యంతో ఉండటంతో వండుకోలేక తిండి పెట్టేవాళ్లు లేక మంచాన పడి అల్లాడుతున్నారు.

ఏటువంటి బంధుత్వం లేకపోయినా చుట్టుపక్కల ఉండేవాళ్ల అయ్యో పాపం అంటూ మానవత్వంతో వారికి అన్నం పెట్టి తోచిన సహాయం చేస్తూ వీరిని ఆదుకుంటున్నారు. ఆస్తిపాస్తుల పంపకాలలో ముగ్గురు పిల్లలు వీరిని విభేదించి ఎవరి దారిన వారు వెళ్లిపోవడంతో.. వీరిని పట్టించుకునే వారే లేక అనాథలుగా మిగిలారు. జాఫర్ హుస్సేన్ ఉన్నతంగా బ్రతుకుతూ పది మందిలో మంచి పేరు తెచ్చుకున్నారు. తన శక్తి కొద్ది పిల్లలను పెద్ద చేసి కుమారుడికి, ఇద్దరు ఆడ పిల్లలకు వివాహాలు జరిపారు.

"నాకు ముగ్గురు పిల్లలు. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. ఆ ముగ్గురు నా ఆస్తులు తీసుకోని తరిమేశారు. మా ప్రాణం పోక, ఆగక అల్లాడుతున్నాము. బాధలు పడుతూ జీవితాన్ని నెట్టుకొట్టుస్తున్నాము."- జాఫర్ హుస్సేన్, బాధిత వృద్ధుడు

తమ పిల్లలు తనకున్న ఆస్తులు పంచుకొని అనంతరం తమను అనాథలుగా వదిలేసి ఎవరు దారిన వారు వెళ్లిపోయారని జాఫర్ హుస్సేన్ ఆవేదనతో తెలిపారు. ఈ వృద్ధులు కొద్ది రోజులు బాగానే ఉన్నా ఒక్కసారిగా ఇద్దరు అనారోగ్యం పాలై మంచాన పట్టడంతో వీరిని ఆదుకోవాల్సిన కన్నబిడ్డలు కనికరం కూడా లేకుండా వదిలేసి కంటికి కనిపించకుండా వెళ్లిపోయారు. మంచానపడ్డ ముసలి దంపతుల పరిస్థితిపై స్థానికులు వారి పిల్లలకు సమాచారం ఇచ్చారు. కానీ వారు మాత్రం కనికరం లేకుండా వాళ్ల గురించి మాకు అవసరం లేదు.. మాకు మీరెవరూ ఫోన్ చేయొద్దంటూ.. సమాధానం చెప్పడంతో చుట్టుపక్కల ఉండే వారు వృద్ధ దంపతుల బాధను చూస్తూ ఉండలేక.. తలా కాస్త సహాయం చేస్తున్నారు. ఆ వృద్ధ దంపతులు బ్రతుకు బండి ఈ విధంగా ఈడ్చుకుంటూ వస్తున్నారు.

"వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నేను వాళ్లకి ఫోన్ చేశాను. వాళ్లను చూసే ప్రసక్తే లేదు..సంబంధమే లేదని కచ్చితంగా చెప్పాడు. బతిమిలాడినా ఏమీ చేసుకుంటారో చెసుకోండి అంటున్నాడు. పెద్దమ్మాయి కూడా పట్టించుకోనని, సంబంధం లేదని ఖరాకండిగా చెప్పింది." సురా భాస్కర్ రెడ్డి, ఆత్మకూరు 20వ వార్డు కౌన్సిలర్

చుట్టుపక్కల వాళ్లు ఎంత సహాయం చేసినా వారి వెంట నా అనేవాళ్లు ఎవరూ లేక విలవిలాడుతున్నారు. తమ లాంటి బ్రతుకు పగవాడికి కూడా వద్దంటూ ఈ ముసలి దంపతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి వీరి పిల్లలతో మాట్లాడినా వారి తల్లిదండ్రులను చూడడానికి ఆసక్తి చూపలేదంటూ తెలిపారు. కాటికి కాలు చాచిన వయసులో ఈ ముసలి వాళ్లను కన్న బిడ్డలు ఆదరించాల్సి ఉండగా.. వారిని గాలికి వదిలేసి వెళ్లిపోవడం బాధాకరమని స్థానికులు వాపోతున్నారు.

తమను ఆదుకోవాలని జాఫర్ హుస్సేన్ దంపతులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

"ఆ వృద్ధ దంపతులను చూసేవాళ్లు ఎవ్వరూ లేరు. గత మూడు సంవత్సరాల నుంచి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. స్థానికులే వారి పరిస్థితిని చూడలేక సహాయం చేస్తున్నారు."- రఫీ, స్థానికుడు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.