ETV Bharat / state

వాయిదా పడిన ప్రాంతాల్లో.. ముగిసిన పంచాయతీ ఎన్నికలు - chejerla panchayati elections updates

నెల్లూరు, కడప అనంతపురం జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో వాయిదాపడిన పంచాయతీ ఎన్నికలు ఇవాళ జరిగాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కాసేపట్లో ఫలితాలను ప్రకటించనున్నారు.

panchayati elections
నేడు పంచాయతీ ఎన్నికలు
author img

By

Published : Mar 15, 2021, 7:36 AM IST

Updated : Mar 15, 2021, 4:31 PM IST

నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో పలు గ్రామాల్లో ఇవాళ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. నెల్లూరు జిల్లా చేజర్ల, మర్రిపాడు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. గతంలో జరగాల్సిన ఎన్నికలు పలు కారణాల వల్ల వాయిదా పడ్డాయి. చేజర్ల మండలం వావిలేరు, మైపాటివారి కండ్రిక... మర్రిపాడు మండలం కంపసముద్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

కడప జిల్లా వేంపల్లె మండలం టి.వెలమవారిపల్లెలోనూ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. గత ఎన్నికల సమయంలో అభ్యర్థులు లేక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. పెద్దవడూగురు మండలం రావులుడికి పంచాయతీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థి మృతి కారణంగా గతంలో ఇక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరిగింది. కాసేపట్లో ఫలితాలను వెల్లడించారు.

ఇదీ చదవండి:

పురపోరులో ప్రాంతాలకు అతీతంగా ఫ్యాన్ ప్రభంజనం

Last Updated : Mar 15, 2021, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.