ప్రపంచ దేశాల్లో దేశ కీర్తి ప్రతిష్ఠలు పెంచిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి అన్నారు. మోదీ ఏడాది పాలనపై నెల్లూరులోని భాజపా కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేశారు. ఏడాదిలో భాజపా ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించటంతోపాటు, ప్రజా సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసిందన్నారు. ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని, దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని కొనియాడారు.
ఇదీ చూడండి సభలో సమరం: నల్ల చొక్కాలతో హాజరవ్వాలని తెదేపా నిర్ణయం