కుంచె నుంచి అద్భుతమైన చిత్రాలు జాలువారేందుకు కాదేది అనర్హం అనేలా ఉన్నాయి ఈ ప్రదర్శనలో చిత్రాలు. భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు, గ్రామీణ వాతావరణం, ప్రకృతి అందాలు ప్రతిబింబించేలా కొన్ని చిత్రాలు ఉంటే... త్రీడి మ్యూరల్స్, ఆయిల్ పెయింటింగ్స్, యాక్రిలిక్ చిత్రాలు, రంగులు లేకుండా కేవలం పెన్సిల్‌తో గీసినవి, తంజావూర్ రకం, బంగారు పొరతో గీసిన చిత్రాలు, క్రాఫ్ట్ వర్క్ చిత్రాలు ఇలా విభిన్న రకాల పెయింటింగ్స్ చూపరులను అబ్బురపరుస్తున్నాయి. కళ్లు తిప్పకుండా మళ్లీమళ్లీ చూసేలా మురిపించి మైమరపిస్తున్నాయి.
ఎంతటి విషయాన్నైనా ఒక్క చిత్రంలో చూపించగలగటం చిత్రకారుల గొప్పతనం. అటువంటి ప్రతిభావంతులైన చిత్రకారులు ఈ ప్రదర్శనలో తమ కళాఖండాలను పదర్శించారు. వీరు ఎన్నో ఏళ్లుగా చిత్రాలను గీయడంలో అనుభవం ఉన్నవారు. జాతీయ, రాష్ర్ట స్థాయిలో అవార్డులు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. యువతను చిత్రకారులుగా తయారు చేయడానికి తల్లితండ్రులు శ్రద్ధ చూపాలని వారు కోరుతున్నారు. ఈ ప్రదర్శనను చూసేందుకు నగర ప్రజలు తరలివస్తున్నారు. చిన్నపిల్లలు ఆసక్తితో తిలకిస్తున్నారు. కళాకృతులతో స్వీయ చిత్రాలు దిగుతున్నారు. తమ చరవాణుల్లో కళాఖండాలను బంధిస్తూ సందడి చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'వైకాపా ఆగడాలను ఎదుర్కొంటాం'