దఫాల వారీగా పదవి పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి గ్రామ పెద్దల ఐక్యతతో ఏకగ్రీవంగానే సర్పంచిని ఎన్నుకుంటున్నారు. మొదట్లో అందరూ కలిసి చర్చించుకొని ఓ వ్యక్తిని ఎన్నుకునేవారు. తర్వాత తెదేపా, కాంగ్రెస్, భాజపా నాయకులు దఫాల వారీగా సర్పంచి పదవిని తీసుకుంటూ ఏకగ్రీవం చేసుకున్నారు. 2013లో మొదటిసారి పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత పరిమాణాల నేపథ్యంలోనూ పలువురు పోటీకి ముందుకొచ్చారు. దాంతో ఏకగ్రీవాల పంచాయతీగా పేరొందిన చిన్నచెరుకూరుకు 2013 నుంచి ఆ ఖ్యాతి పోయింది. - టి.పి.గూడూరు |
వీరయ్య స్వామి సాక్షిగా.. డక్కిలి మండలం దందవోలు నుంచి 1980లో నడింపల్లి కొత్త పంచాయతీగా ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు ఆరుగురు సర్పంచులు ఎన్నికయ్యారు. అయిదుసార్లు ఏకగ్రీవం కాగా.. ఒకసారి మాత్రమే ఎన్నిక జరిగింది. తొలుత 1981లో నిర్వహించిన ఎన్నికల్లో అద్దంకి పాపానాయుడ్ని గ్రామస్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇద్దరు దాయాదులు పోటీ పడటంతో ఎన్నిక అనివార్యమైంది. ఇలా గెలిచి.. ఓడిన వర్గాల మధ్య కొంతకాలం చిన్న సమస్యలపై వివాదాలు జరిగి కోర్టుల వరకు వెళ్లాయి. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో మళ్లీ ఏకగ్రీవ బాట మొదలైంది. ఇక్కడ విశేషమేంటంటే అవధూత వీరయ్య తాత గుడి వద్ద ఈ ఎన్నిక జరుగుతుంది. గ్రామంలో ఏ శుభకార్యం చేయాలనుకున్నా తొలుత ఈ ఆలయం వద్ద పూజలు చేయడం సంప్రదాయం. అలాగే గొడవలు జరిగినా ఇక్కడ తప్పొప్పులు తెలుసుకొని రాజీ కుదుర్చుకుంటారు. ఈక్రమంలో సర్పంచి ఎన్నికల ఇక్కడే జరుగుతుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిచ్చే నజరానాలను ఈ ఆలయ అభివృధ్ధికి మాత్రమే ఖర్చు చేస్తుండటం విశేషం. - డక్కిలి (బాలాయపల్లి) |
అలా అనివార్యమైంది.. జాతీయ ఉత్తమ పంచాయతీగా ఖ్యాతినార్జించిన తిమ్మాజీకండ్రిగలో 35 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. మిగతా సమయంలో ఇక్కడ ఏకగ్రీవ బాటే కొనసాగింది. అభివృద్ధి విషయంలో నేతలందరిదీ ఒకేబాట కావడంతో సర్పంచి ఎన్నికలు నల్లేరుపై నడకలా సాగుతున్నాయి. దాంతో ఆదర్శ గ్రామంగా పేరొందింది. 1981 వరకు ఈ గ్రామం చిగురుపాడు పంచాయతీ పరిధిలో ఉండేది. అప్పట్లో విశ్రాంత కలెక్టర్ మునిరత్నం చొరవతో కొత్త పంచాయతీగా ఏర్పడింది. 1981, 1987లో తాళ్వాయిపాటి వెంకయ్య, 1990, 1995లో లోడారి మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2001లో జరిగిన ఎన్నికల్లో సర్పంచి పదవి ఎస్సీ వర్గాలకు కేటాయించడంతో పోటీ అనివార్యమైంది. ఆ పోటీలో కల్లూరు సుమతి సర్పంచిగా గెలిచారు. - నాయుడుపేట |
తోడేరు.. తప్పని పోరు పొదలకూరు మండలంలో తోడేరు 1965లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి దాదాపు అయిదున్నర దశాబ్దాలుగా ఏకగ్రీవంగానే సర్పంచి ఎన్నిక సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తండ్రి రమణారెడ్డి గ్రామ సర్పంచిగా ఎక్కువ కాలం పనిచేశారు. పొదలకూరు పంచాయతీ సమితి ప్రెసిడెంటుగా 18 ఏళ్లు ఏకగ్రీవంగా కొనసాగారు. ఆ సమయంలో ఆయన సతీమణి కాంతమ్మ సర్పంచి అయ్యారు. 1986లో జరిగిన రాజకీయ పరిణామాల్లో ఎన్నిక జరిగింది. ఎస్సీలకు ఈ స్థానం రిజర్వు చేయడంతో తురకా భాస్కర్ సర్పంచిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నుంచి యథాతథంగా ఏకగ్రీవ బాటే కొనసాగుతోంది. - పొదలకూరు |
మారిన బాణి ఆత్మకూరు మండలం నారంపేటలో కంచర్ల శ్రీహరినాయుడు పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి మొదటి మూడు దఫాలు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తన 200 ఎకరాలను పేదలకు పంపిణీ చేశారు. గ్రామంలో చేసిన అభివృద్ధి కారణంగా ఎన్నికల పోటీ ప్రస్తావన ఉండేది కాదు. ప్రతిసారీ ఏకగ్రీవాలే జరిగేవి. 2013 ఎన్నికల్లో పోటీ అనివార్యమవ్వగా.. శ్రీహరినాయుడు కోడలు కంచర్ల మాధవి పోటీలో నిలిచి విజయం సాధించారు. ప్రత్యర్థికి కేవలం 13 ఓట్లే వచ్చాయి. - ఆత్మకూరు |
ఆసక్తికర పరిణామాల సమాహారం.. ఒక్కసారే ఓటు వినియోగం! - నెల్లూరు పంచాయతీ వ్యవస్థ వార్తలు
అవును.. ‘స్థానిక’ పోరులో వారు ఒక్కసారే ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆ ముందు.. తర్వాత ఓటేయడం ఎరుగరు. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం.. కొన్ని దశాబ్దాలుగా అదే కథ. ఆది నుంచి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నా.. గ్రామాభివృద్ధికి పాటుపడుతున్న నాయకులకు ప్రజలు మళ్లీ మళ్లీ పాలనా పగ్గాలు అప్పగిస్తున్నారు. ఆ క్రమంలో ఆ పల్లెలు ఏకగ్రీవాల బాట పడుతున్నాయి. కొన్ని సమయాల్లో రాజకీయ మలుపుల కారణంగా ఎన్నికలు అని వార్యమైనా... అదీ ఇప్పటి వరకు ఒక్క దఫా మాత్రమే. నెల్లూరు జిల్లాలో ఆయా ఆసక్తికర పరిణామాల సమాహారంపై ప్రత్యేక కథనం.