లాక్డౌన్ కారణంగా అభాగ్యులు, వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రమీల అనే వృద్ధురాలు ఆకలితో దీనంగా ఎదురు చూసిన తీరు కలిచివేసింది. ఈమెకు నా అనేవారు లేరు. చాలా ఏళ్ల క్రితం తమిళనాడు నుంచి ఇక్కడకు వచ్చింది. లాక్డౌన్ నేపథ్యంలో తిండి దొరక్క ఇబ్బందులు పడుతుంది. చివరకు కొందరు యువకులు ఆహారం అందించటంతో కడుపు నింపుకుంది.
ఇదీ చూడండి: