నెల్లూరు జీజీహెచ్‌లోని కొవిడ్ కేంద్రంలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మూలపేట ప్రాంతానికి చెందిన పరమేశ్వరమ్మ కొన్ని రోజుల క్రితం పాజిటివ్‌తో ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతున్న ఆమె... చీరతో... ఇనుప కమ్మీకి ఉరివేసుకుంది.
ప్రభుత్వాసుపత్రిలోనే ఈ ఘటన జరగటంతో చర్చనీయాంశమైంది. కరోనా సోకినప్పటి నుంచి ఆగకుండా వాంతులు అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీని వల్లే ఆమె భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: పనుల కనికట్టు..అవినీతి గుట్టురట్టు