నెల్లూరు జిల్లా వరప్రదాయని సోమశిల జలాశయం జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా.. రికార్డు స్థాయిలో 74 టీఎంసీల నీరు చేరింది. ఈ నేపథ్యంలో కండలేరు, ఉత్తర, దక్షిణ కాలువల ద్వారా 12 వేల క్యూసెక్కులు... 6, 7 ,11 క్రస్ట్ గేట్ల ద్వారా 20,000 క్యూసెక్కుల వరదనీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకూ 30 టీఎంసీల నీటిని జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్ కండలేరు, ఇతర చెరువులకు వదిలారు.
యంత్రాంగం అప్రమత్తం
ప్రాజెక్టుకు భారీగా నీరు చేరడం వల్ల సోమశిల నుంచి నెల్లూరు వైపునకు రాకపోకలను ముందస్తుగా అధికారులు నిలిపేశారు. సంగం నుంచి పొదలకూరు, చెజర్ల మండలాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అనంతసాగరం, కలువాయి, సంగం, చెజర్ల, ఆత్మకూరు మండలాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఇదీ చూడండి: