అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరులోని NNP+ (Nellor Network Of People Living With HIV/Aids) వారి ఆధ్వర్యంలో హెచ్ఐవీ బాధితులు, ఒంటరి మహిళలకు పౌష్టికాహారం పండ్లు, ధాన్యం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్జీవో ప్రతినిధులు.. సమాజం పట్ల ప్రతీ ఒక్కరు బాధ్యతగా ఉండాలన్నారు. కష్టాల్లో ఉన్నవారిని మానవతా ధృక్పథంతో ఆదుకోవాలని సూచించారు. తద్వారా మెరుగైన సమాజం నిర్మితమవుతుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో డీఎల్వో రమాదేవి, NNP+ అధ్యక్షుడు ధనుంజయ, గుత్తి విజయ్ కుమార్, స్వర్ణలత, కొండపనాయుడు, మంజుల, ఇతర ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : CM Jagan: మహిళలకు 51 శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే: సీఎం జగన్