కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఏడాదిన్నరగా నిధులు విడుదల కాకపోవడంతో మొక్కల పెంపకం పై నీలినీడలు కమ్ముకున్నాయి. అందులో పనిచేసే కూలీలకు డబ్బులు రాక అవస్థలు పడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్న రహదారుల వెంబడి పొలంగట్లు, బంజరు భూముల్లో మొక్కలు నాటేందుకు మొక్కలు కొరత ఏర్పడింది. సంవత్సరకాలంగా లక్షల రూపాయల బిల్లులు రాలేదు. నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు నిధులు విడుదల కాకపోవడంతో మొక్కల పెంపకం నిలిచిపోయింది.
అంతకుముందు పెంచిన కొన్నిమొక్కలను వర్షాలు కురుస్తుండటంతో తీసుకెళ్లి నాటుతున్నారు. నిధులు విడుదల కోసం పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదు. చెట్లు పెంపకంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమని శ్యాస్త్రవేత్తలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.
ఇదీ చదవండి: అమితాబ్, అభిషేక్ ఆరోగ్యం మెరుగ్గా ఉంది