ETV Bharat / state

నివర్ తుపాన్​ ప్రభావంతో అతలాకుతలమైన నెల్లూరు

author img

By

Published : Nov 26, 2020, 9:02 PM IST

నివర్​ తుపాన్​ తీరం దాటినా.. జిల్లాల్లో ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. నెల్లూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

nivar storm
నెల్లూరులో నివర్​ తుపాన్​ ప్రభావం

నెల్లూరు జిల్లాలో నివర్​ తుపాన్​ కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. ఎడతెరపి లేకుండా పడుతున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాల్వలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నెల్లూరు నగరంలోని జయలలిత నగర్ ప్రాంతంలో చెట్టు కూలి ఇళ్లపై పడటంతో నాలుగిళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రగతి నగర్​లో చెరువు నీరు ఇళ్లలోకి చేరింది. పలు చోట్ల విరిగిన చెట్లు తొలగించి, తెగిన కరెంటు తీగలను సరిచేసేందుకు సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. రామలింగాపురం దగ్గరున్న ఇరిగేషన్ కార్యాలయాన్ని వర్షపు నీరు చుట్టుముట్టింది.

ఇదీ చదవండి: వరుణుడి బీభత్సం.. నీట మునిగిన పంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.