తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ రకాల ఆకారంలో రంగురంగుల కేకులు... మిఠాయిలను వ్యాపారులు సిద్ధం చేశారు. అనంతపురం జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దుకాణదారులు మిఠాయిలతో ప్రత్యేక దేవుని ప్రతిమలను ఏర్పాటు చేశారు. రకరకాల మిఠాయిలతో చేసిన వెంకటేశ్వర స్వామి, ఓం అలంకారం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు కొత్త సంవత్సరాన్ని 2020 ఆకారంలో కూర్చుని స్వాగతం పలికారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. 2020లో సర్వ సుఖాలు సౌఖ్యాలు కలగాలని కోరుతూ క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రకాశం జిల్లా చీరాలలోని పలు కళాశాలల విద్యార్థులు.. ఎన్నో ఆశలని మోసుకొస్తున్న నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. కేకు కోసి వేడుకలు చేసుకున్నారు. ఈ నూతన సంవత్సరం అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
ఇదీ చదవండి: