ETV Bharat / state

'వైకాపా అధికారంలోకి వచ్చాక దళితులు, బీసీలపై దాడులు జరుగుతున్నాయి'

author img

By

Published : Jun 17, 2020, 4:04 PM IST

నెల్లూరు నగరంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని కోరుతూ.. ఆ జిల్లా తెదేపా నేతలు కలెక్టరుకు వినతిపత్రం అందించారు. అధికార పార్టీ నేతలు మహిళలు, దళితులు, బీసీలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.

nellore tdp leaders kotamreddy srinivasulu reddy abdul ajeej request letter to collector
కలెక్టరుకు వినతిపత్రం అందిస్తున్న తెదేపా నేతలు

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటినుంచి మహిళలు, దళితులు, బీసీలపై అరాచకాలు జరుగుతున్నాయని నెల్లూరు తెదేపా నేతలు ఆరోపించారు. నాయకులపై అక్రమ కేసులు అరికట్టాలని కోరుతూ కలెక్టర్ శేషగిరిబాబుకు తెదేపా నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్​లు వినతిపత్రం అందించారు. అధికార పార్టీ నేతలు ఇసుక, మట్టిని ఇష్టానురాజ్యంగా తవ్వుకుంటున్నారని విమర్శించారు.

అవినీతిని ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇళ్ల స్థలాల పేరుతో గత 50 ఏళ్లుగా ఉంటున్న పేదల భూములు లాక్కుంటున్నారన్నారు. నగరంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కలెక్టరును కోరారు.

ఇవీ చదవండి... పనిచేయని సర్వర్.. ఇబ్బందుల్లో ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.