ETV Bharat / state

స్థిరాస్తి వ్యాపారి హత్య కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో కీలక నిందితుడు - nellore real estate trader murder case

రాష్ట్రానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి విజయభాస్కర్​ రెడ్డి హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసులో కీలక నిందితుడు త్రిలోక్​నాథ్​ బాబాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ముందు మృతుడికి ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చిన నిందితుడు మల్లేశ్​ కుమారుడు కార్తీక్​ను సైతం పోలీసులు విచారణ చేస్తున్నారు.

హత్య కేసులో పురోగతి
హత్య కేసులో పురోగతి
author img

By

Published : Aug 12, 2021, 3:50 PM IST

స్థిరాస్తి వ్యాపారి విజయ భాస్కర్ రెడ్డి హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో కీలక నిందితుడు త్రిలోక్‌నాథ్‌ బాబా ఉన్నాడు. త్రిలోక్​నాథ్​ను హైదరాబాద్​ ఎస్​వోటీ పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్​ రెడ్డి హత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. బాబాతో పాటు మరో నిందితుడు కార్తీక్​.. పోలీసుల అదుపులో ఉన్నాడు. భాస్కర్​ రెడ్డి హత్యకు ముందు.. ఆహారంలో కార్తీక్​ మత్తు మందు కలిపి ఇచ్చాడనే ఆరోపణలతో అతడిని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు నలుగురు నిందితులు మల్లేశ్​, సుధాకర్​, కృష్ణం రాజు, ఆర్​ఎంపీ వైద్యుడిని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాలు, కాల్​ సీడీఆర్​ ఆధారంగా ఇతరుల పాత్ర ఎంతమేరకు ఉందనేది దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా గుప్త నిధులు, రియల్​ ఎస్టేట్​ గొడవలపైనా ఆరా తీస్తున్నారు.

అసలేం జరిగింది..

నెల్లూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి విజయ్​ భాస్కర్​ రెడ్డి.. గత నెల 20న హత్యకు గురయ్యారు. ఆ రోజు నుంచి ఆయన ఫోన్ స్విచ్​ ఆఫ్​ రాగా.. భాస్కర్​ రెడ్డి అల్లుడు జయసృజన్​ రెడ్డి.. హైదరాబాద్​ కేపీహెచ్​బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు నివాసం ఉన్న హాస్టల్​ సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టారు. కారులో భాస్కర్​ రెడ్డిని నలుగురు వ్యక్తులు తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు. కారు నంబరు ఆధారంగా మల్లేశ్​, సుధాకర్​, కృష్ణంరాజుతోపాటు ఆర్​ఎంపీ వైద్యుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. విజయ్ భాస్కర్ రెడ్డి హత్య కుట్ర బహిర్గతం చేశారు.

ఇదీ చదవండి: స్థిరాస్తి వ్యాపారి హత్య కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

మల్లేశ్​ కుమారుడు కార్తీక్​ సాయంతో భోజనంలో మత్తు మందు కలిపి భాస్కర్​ రెడ్డికి ఇప్పించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆయన ఆ ఆహారం తిని స్పృహ కోల్పోయిన అనంతరం కారులో తీసుకెళ్లి హత్య చేసినట్లు నిర్ధరణ అయ్యింది. ఈ కుట్ర కోణంలో నెల్లూరుకు చెందిన గురూజీ త్రిలోక్​నాథ్​ బాబా హస్తం ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఆ బాబా కేరళలో ఉన్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

చిట్టీల పేరుతో రూ.12 కోట్ల మోసం..మహిళతో పాటు 10 మంది అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.