ETV Bharat / state

భర్తను రక్షించాలని భార్య వేడుకోలు... స్పందించిన పోలీసులు

ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా, అసాంఘిక కార్యకలాపాలకు పోలీసుల దృష్టికి తీసుకురావాలని నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ప్రజలను కోరారు. బెంగళూరు నుంచి రాత్రి ఓ మహిళ తనకు ఫోన్ చేసి, తన భర్త ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని... అతడిని కాపాడాలంటూ వేడుకుందని ఆయన తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి అతడిని పట్టుకుని తిరిగి ఇంటికి చేర్చినట్లు ఎస్పీ వివరించారు.

nellore police saved a man who went to make suicide
భర్తను రక్షించాలని భార్య వేడుకోలు... స్పందించిన పోలీసులు
author img

By

Published : Oct 6, 2020, 5:39 PM IST

అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ప్రజలను కోరారు. వాటిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. బెంగళూరు నుంచి రాత్రి ఓ మహిళ తనకు ఫోన్ చేసి, భర్త తగాదా పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, కాపాడాలని కోరినట్లు ఎస్పీ తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి అతను ప్రయాణిస్తున్న మార్గాన్ని గుర్తించామన్నారు. జాతీయ రహదారిపై అతనిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి ఇంటికి చేర్చినట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామన్నారు.

ఇదీ చదవండి:

కర్ణాటకలో పర్మిట్ లేని ఆరెంజ్​ బస్సులు సీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.