ETV Bharat / state

వర్షం అంటేనే భయపడుతున్న నెల్లూరు ప్రజలు - తుఫాన్​ కారణంగా రెండ్రోజులుగా తీవ్ర ఇబ్బందులు - నెల్లూరులో వర్షాలు

Nellore People Suffer with Worst Drainage System: అక్కడి ప్రజలకు వర్షం అంటే భయం. డ్రైనేజీ వ్యవస్థ లోపంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతుంది. నెల్లూరు నగర కార్పోరేషన్‌, శివారు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నెల్లూరు నగరవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

Nellore_People_Suffer_with_Worst_Drainage_System

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 12:33 PM IST

Updated : Nov 22, 2023, 1:54 PM IST

వర్షానికి భయపడుతున్న నెల్లూరు ప్రజలు - తుఫాన్​ కారణంగా రెండ్రోజులుగా తీవ్ర ఇబ్బందులు

Nellore People Suffer with Worst Drainage System : నెల్లూరు నగర కార్పోరేషన్​లోని 9 లక్షల మంది ప్రజలకు వర్షం అంటే భయం. చినుకుపడితే కార్పోరేషన్​లోని అనేక ప్రాంతాలు మునకకు గురవుతున్నాయి. మురుగుపారుదల వ్యవస్థ సరిగా లేక ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతుంది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు ప్రవహించి చెరువులను తలపిస్తున్నాయని వాపోతున్నారు. గత నాలుగున్నర ఏళ్లుగా నెల్లూరు పరిస్థితిని మార్చడానికి పాలకులు తీసుకున్న చర్యలు ఏమిటో చేప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు నగర పరిస్థితి చాలా దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Drainage Situation in Nellore : తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నెల్లూరు నగరం ప్రధాన ప్రాంతాల్లో రోడ్లు మునిగిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. నగరం నడిబొడ్డులోనూ డ్రైనేజీ వ్యవస్థ (Drainage System) సరిగా లేకపోవడంతో నగరవాసులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. మురుగు కాలువల్లో నీరు అంతా బయటకు రావడంతో మురుగు నీటిలోనే నగర ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. గాంధీ బొమ్మ సెంటర్, సండే మార్కెట్, పోగతోటల్లో ఉంటే అసుపత్రుల రోడ్లన్నీ వర్షపు నీటితో మునిగి పోయాయని అంటున్నారు. వర్షపు నీరు మురుగు నీరు రెండు కలసి దుర్గంధంగా మారుతోంది.

Vambay Colony People Problems Due to Poor Sanitation: వాంబే కాలనీవాసుల వ్యధ.. కానరాని మౌలిక వసతులు.. అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ..

Nellore Worst Roads : కార్పోరేషన్​లోని కాలనీలు, నగరంలోని ప్రధాన కూడళ్లను కలిపే అండర్ గ్రౌండ్ వంతెనల్లో వర్షపు నీరు ప్రవాహం ఉంటుంది. అటువైపుగా రాకపోకలు చేయలేక ప్రజలు అల్లాడిపోతుంటారు. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం డ్రైనేజీ, రోడ్ల వ్యవస్థ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం వల్లే అవస్థలు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇళ్ళలోకి కూడా నీరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Rains in Nellore : నెల్లూరులో పట్టణ ప్రణాళిక లేకుండా ఇళ్లు నిర్మాణాలు చేయడంతో శివారు కాలనీలన్నీ చెరువులని తలపిస్తున్నాయి. రోడ్లు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. అనేక రోడ్లు కోతలకు గురయ్యాయి. నగరంలోని వర్షపు నీరు శివారు కాలనీల్లోకి పొంగి ప్రవహిస్తాయి.

Poor Drainage System in Vijayawada : నగరానికి శాపంలా డ్రైనేజీ వ్యవస్థ.. ఎక్కడ చూసినా మురుగే..

Poor Drainage System in Nellore : ఎన్టీఆర్ నగరం, వైఎస్ఆర్ కాలనీ, వెంకటేశ్వరపురం, కిసాన్ నగర్, పొదలకూరు రోడ్డు ప్రాంతాలు అనేకం వర్షాలతో మునిగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగున్నరేళ్లుగా శివారు కాలనీల్లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంతో ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నగర్, తల్పగిరి కాలనీ, రెవెన్యూ కాలనీ, కొత్తూరు ప్రాంతం అనేక కాలనీల్లో ఇళ్ల ముందు నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధిపై చర్యలు చేపట్టాలని నెల్లూరు నగరవాసులు కోరుతున్నారు.

Roads,Drainage Worst Condition in Auto Nagar : ఆటోనగర్​లో అధ్వానంగా పారిశుధ్యం.. పట్టించుకోని అధికారులు..ఇబ్బందుల్లో కార్మికులు

Last Updated : Nov 22, 2023, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.