లాక్డౌన్ దృష్ట్యా రైతుల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేయనున్నారు. దీనికోసం అన్నదాతకు అండగా కార్యక్రమం మెుదలైనట్లు సంయుక్త కలెక్టర్ వినోద్ కుమార్ వివరించారు. దళారీలు లేకుండా రైతుల వద్దకే వెళ్లి క్వింటాలుకు 1815రూపాయలు, ఏ గ్రేడ్ రకం 1835 రూపాయల వంతున చెల్లిస్తామని తెలిపారు. పొలం వద్దకు వెళ్లినప్పుడు రైతులకు బయోమెట్రిక్ లేదా మొబైల్ ఓటీపీ ద్వారా ధ్రువీకరిస్తారని వివరించారు.
ఇదీ చదవండి: టెలీ మెడిసిన్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయండి: సీఎం