నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికి 32కేసులు నమోదు అయ్యాయి. 71 ఫలితాలు రావలసి ఉంది. అందులో ఈ రోజు 41 నివేదికలు వచ్చాయి. అన్నీ నెగెటివ్‌గా రావటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరికొన్ని నివేదికలు రావలసి ఉంది. పాజిటివ్ కేసులు వచ్చిన నెల్లూరు, నాయుడుపేట, గూడూరు, టీపీ.గూడూరు ప్రాంతాల్లో రసాయనాలతో కాలనీలను శుభ్రం చేశారు. ఆ ప్రాంతాల్లో రాకపోకలు లేకుండా బారికేడ్లతో కట్టుదిట్టం చేశారు.
ఇదీ చదవండి: '30 శాతం కేసులకు తబ్లీగీనే కారణం.. 17 రాష్ట్రాల్లో ప్రభావం'