ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో లాక్​డౌన్​ ప్రశాంతం - corona effect in nellore district

నెల్లూరు జిల్లాలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు అధిక సంఖ్యలో గ్రామాల ప్రజలు.. తమ రోడ్లను దిగ్బంధం చేశారు. ముత్తుకూరులోని పేద ప్రజలకు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్​ రెడ్డి ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు.

nellore district lockdown news
నెల్లూరు జిల్లాలో లాక్​డౌన్​ ప్రశాంతం
author img

By

Published : Mar 29, 2020, 9:22 AM IST

వెంకటగిరి

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు పలు గ్రామాలు చైతన్యంతో వ్యవహరిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి తమ గ్రామాలకు కొత్త వాళ్లు రాకుండా ఉండటానికి రోడ్లను దిగ్బంధనం చేస్తున్నారు. వెంకటగిరి మండలం మొగల్లా గుంట, గొట్లగుంట గ్రామాల్లో రోడ్లను కంప వేసి దిగ్బంధం చేశారు. గొట్లగుంట వాసులు ఇనుప కంచె వేసి హెచ్చరిక బోర్డ్ అంటించారు. బాలాయపల్లి మండలం భైరవరం గ్రామంలో కూడా రోడ్డుపై కంప వేసి ఇతరులను గ్రామంలోకి ప్రవేశించే అవకాశం లేకుండా చేశారు. కలువాయి మండలం నూకనపల్లి, డక్కిలి మండలం నరసనాయుడు పల్లి తదితర గ్రామాల్లోనూ ఈ తరహా చర్యలు పాటించారు.

కరోనా వైరస్ ప్రభావంతో ఇంటి నుంచి బయటకు రాకుండా ఇబ్బందులు పడుతున్న పేదలకు ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని నేతలు కోరారు.

ఇదీ చదవండి:

కరోనా ప్రభావం: కాాశీలో చిక్కుకున్న నెల్లూరు యాత్రికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.