కొవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడటంపై భాజపా నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు భరత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచాలని, ఆక్సిజన్ సరఫరా పెంచి బాధితుల ప్రాణాలు కాపాడాలని కోరారు. జిల్లాలో ఆక్సిజన్ రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేసి బాధితుల అవస్థలు తీర్చాలని భాజపా సీనియర్ నేత మిడతల రమేష్ ప్రభుత్వానికి విన్నవించారు.
ఇవీ చూడండి: