నెల్లూరు జిల్లా ఆత్మకూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా చేజర్ల మండలం కోటితీర్థం గ్రామానికి చెందిన యువ ఇంజనీర్ గోతం వెంకట సుబ్బయ్య యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు గుంటూరు మార్కెట్ కమిటీ ప్రధాన కార్యాలయం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. మేకపాటి గౌతం రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ.. పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన వెంకటసుబ్బయ్య నియామకం పట్ల ఆత్మకూరు నియోజకవర్గం, చేజర్ల మండల ప్రజలు, వైకాపా అభిమానులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. నాపై నమ్మకంతో వైస్ చైర్మన్గా నియమించినందుకు వెంకట సుబ్బయ్య యాదవ్.. ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు వెంకటసుబ్బయ్య యాదవ్కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవీ చూడండి...