ETV Bharat / state

'రొట్టెల పండుగకు ఇతర ప్రాంతాల భక్తులకు అనుమతి లేదు' - nellore sp update news

వినాయక చవితి, మెుహరం పండుగలకు అనుమతి లేదనీ... ప్రజలంతా పండుగలను ఇళ్లలోనే జరుపుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రజలను కోరారు. జిల్లాలోనే జరిగే రొట్టెల పండుగకు ఇతర ప్రాంతాల నుంచి భక్తులను అనుమతించలేదని స్పష్టం చేశారు.

nellore collector and sp instructions on festivals
నెల్లూరు జిల్లా కలెక్టర్,ఎస్పీ
author img

By

Published : Aug 13, 2020, 11:47 PM IST

కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. వచ్చే నాలుగు పండుగలను ఇళ్లల్లోనే జరుపుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్​లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వతంత్ర దినోత్సవాలను పరిమితంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జెండా ఆవిష్కరణ, పోలీసుల గౌరవ వందనం, మంత్రి ప్రసంగం, కరోనా సేవకలకు ప్రశంసా పత్రలు అందజేసి వీలైనంత త్వరగా కార్యక్రమాన్ని ముగిస్తామని వెల్లడించారు.

వినాయక చవితి, మెుహరం వేడుకలు అనుమతులు లేవనీ.. ప్రజలు ఇళ్ల నుంచే పండగులు జరపుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా లేని విధంగా జిల్లాలో జరిగే రొట్టెల పండుగకు ఇతర ప్రాంతాల భక్తులెవరినీ అనుమతించటం లేదన్నారు. కరోనా దృష్ట్యా అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. కొవిడ్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందకు అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు.

జిల్లాలో దాదాపు లక్షా 86 వేల పరీక్షలు నిర్వహిస్తే 16 వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయనీయయ వీరిలో 10 వేల మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. కరోనా నివారణ, చికిత్స కోసం జిల్లాలో 104, 1077 కాల్ సెంటర్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అవసరమైతే కరోనా బాధితులను 15 నిమిషాల్లో ఆసుపత్రిలో చేర్చుకునేలా చర్యలు చేపట్టామన్నారు.

ఇదీ చదవండి:

'పరీక్షలు పెంచడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.