ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్ ద్వారా రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు నెల్లూరు కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈమేరకు కేంద్ర సహకార బ్యాంకు నుంచి రూ.100 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. రైతులకు రూ.3 లక్షలు 7 శాతం రాయితీ వడ్డీతో ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడాదిలోపు సకాలంలో చెల్లిస్తే లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీ పడుతుందని... మిగతా రూ.2 లక్షలు పావలా వడ్డీ కట్టాల్సి ఉంటుందని చెప్పారు.
పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, చేపల రైతులకు రూ.2 లక్షలు 7 శాతం వడ్డీకి రుణం ఇస్తున్నట్లు వెల్లడించారు. బంగారం తాకట్టు పెట్టుకుని గ్రాముకు రూ.2200 ఇస్తున్నట్లు తెలిపారు. స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను రైతులకు అందించేందుకు సహకార బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.