నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గుడిపల్లిపాడులో 2 ప్రభుత్వ ఉద్యాన నర్సరీలు ఉన్నాయని అధికారులు చెప్పారు. వీటిలో నిమ్మ, మామిడి మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. 10 వేల మామిడి మొక్కలు, 10 వేల నిమ్మ మొక్కలు ఉన్నాయని తెలిపారు. కావలసిన రైతులు సంప్రదిస్తే తక్కువ ధరకే అందజేస్తామని ఉద్యానశాఖ సహాయ సంచాలకులు కుమార్ తెలిపారు. బయటి నర్సరీలలో మొక్కలు కొనుగోలు చేసి మోసపోకుండా ఉండాలని సూచించారు.
బహిరంగ మార్కెట్లో ఒక్కో మామిడి మొక్క రూ.50 నుంచి రూ.60 వరకు అమ్ముతున్నారని... ప్రభుత్వ నర్సరీలో రూ.30 రూపాయలకే అందజేస్తామన్నారు. నిమ్మ 30 నుంచి 40 రూపాయలు ఉండగా రూ.15కే ఇస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉద్యానశాఖ అధికారులు కోరారు.
ఇవీ చదవండి...