ETV Bharat / state

మా గుడిసెలు కూల్చివేస్తున్నారు.. కాపాడండి సారూ..! - గుడిసెలు కూల్చేస్తున్నారని నక్కా గోపాల్ నగర్ వాసుల ఆందోళన

ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న తమపై కొందరు దౌర్జన్యం చేస్తున్నారని.. నెల్లూరు జిల్లా నక్క గోపాల్​నగర్ వాసులు ఆరోపించారు. కూలి పని చేసి సంపాదించుకున్న డబ్బుతో గుడిసెలు వేసుకుంటే.. వాటిని కూల్చేస్తున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని.. బాధితులు జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కా ళ్లపై పడి వేడుకున్నారు.

nakka gopalnagar people of nellore protest at collectorate for their huts being demolished
మా గుడిసెలు కూల్చివేస్తున్నారు.. కాపాడండి సారు..!
author img

By

Published : Dec 24, 2021, 6:51 PM IST

నెల్లూరు జిల్లాలోని నక్క గోపాల్​నగర్​ వాసులు.. కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న తమపై కొందరు దౌర్జన్యం చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. అయిదేళ్లుగా.. రియల్టర్ల నుంచి ఇబ్బందులు పడుతున్నా.. తమవైపు ఒక్కరు కూడా కన్నెత్తి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కూలి పని చేసి సంపాదించుకున్న డబ్బుతో గుడిసెలు వేసుకుంటే.. వాటిని కూల్చేస్తున్నారని వాపోయారు. రౌడీలతో తమపై దాడి చేయించటమే కాకుండా.. తమకు మద్దతుగా ఉన్న టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు ఆశిక్ ను హతమార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని.. బాధితులు జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్​ను కాళ్లపై పడి వేడుకున్నారు.

ఇదీ చదవండి:

RAIDS IN CINEMA THEATERS: సినిమా హాళ్లలో తనిఖీలు..మరో నాలుగు థియేటర్లు సీజ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.