కుమారుడిని పోలీసులు కొట్టారని తల్లి ఆత్మహత్యాయత్నం నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన కుమారుడు మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడంటూ... పోలీసులు కొడుతున్నారని ఆరోపించింది. తమ పక్క గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను... ఈ నెల 30న ఓ యువకుడు వివాహం చేసుకున్నాడ... ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో మందలించారు.
తన కుమారుడు పోలీసుల అదుపులో ఉండటం తట్టుకోలేక... ఆ తల్లి సూపర్ వాస్మయిల్ ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. గమనించిన బంధువులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మైనర్ బాలికను వివాహం చేసుకున్న కారణంగా యువకుడిపై కేసు నమోదు చేస్తుంటే... తమను బెదిరించేందుకే యువకుడి తల్లి ఈ విధంగా చేసిందని పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి : దేపూరు వద్ద ఒకేసారి రెండు ఆలయాల్లో చోరీ