ETV Bharat / state

మాకొద్దీ చెత్త షెడ్డూ.. ఎమ్మెల్యే సంజీవయ్య అడ్డగింత - ఎమ్మెల్యే సంజీవయ్య తాజా వార్తలు

చెత్త తరలించే వాహనాలు నిలిపేందుకు రూ.8 లక్షల వ్యయంతో నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నిర్మించిన షెడ్డు ప్రారంభోత్సవం రసాభాసగా మారింది. షెడ్డు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే సంజీవయ్యను స్థానికులు అడ్డుకున్నారు. ఈ గందరగోళం మధ్యనే ఎమ్మెల్యే షెడ్డును ప్రారంభించారు.

mla sanjevayya
ఎమ్మెల్యే సంజీవయ్య అడ్డగింత
author img

By

Published : Jun 13, 2021, 5:48 PM IST

‍‌

ఎమ్మెల్యే సంజీవయ్యను అడ్డుకున్న నాయుడుపేట వాసులు

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో.. చెత్త తరలించే వాహనాలు నిలిపేందుకు ఏర్పాటు చేసిన షెడ్డు ప్రారంభోత్సవంలో గందరగోళం నెలకొంది. షెడ్డు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే సంజీవయ్యను స్థానికులు అడ్డుకున్నారు. నాయుడుపేట పురపాలక పరిధిలో.. చెత్త తరలించే వాహనాలు నిలిపేందుకు రూ.8 లక్షల వ్యయంతో షెడ్డు నిర్మించారు. దీన్ని ఎమ్మెల్యే సంజీవయ్యతో ప్రారంభించేందుకు ఏర్పాటు చేశారు.

అయితే ఇక్కడ షెడ్డు ఏర్పాటు చేయడం వల్ల దుర్వాసనతో ఇబ్బందిపడాల్సి వస్తోందని స్థానిక బీడీ కాలనీ వాసులు ఎమ్మెల్యే సంజీవయ్యతో వాగ్వాదానికి దిగారు. ఆయన్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాలనీ వాసులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక పరిస్థితుల మధ్యే ఎమ్మెల్యే షెడ్డును ప్రారంభించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:

భూ కబ్జాకు పాల్పడిన వారు ఎవరైనా వదిలేది లేదు: మంత్రి అవంతి

Extra fingers: ఈ పిల్లాడికి మెుత్తం 23 వేళ్లు.. చూడండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.