నెల్లూరులోని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసం వద్ద పలువురు తేదేపా నేతలు వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే.. ఎస్ఈసీ తీరును తప్పుబట్టారు. తెదేపా అధినేత చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు ఆశ్చర్యానికి గురిచేశాయని చెప్పారు. రాజకీయ నాయకుడిలా జిల్లాలో పర్యటిస్తూ సమీక్షలు జరపడం తాను ఇప్పటివరకు చూడలేదని అన్నారు.
ఇదీ చదవండి: